బాబీ కొల్లి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు కలిసి నటించిన "వాల్తేరు వీరయ్య"లో శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఫిఫ్త్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు 'నీకేమో అందమెక్కువ..నాకేమో తొందరెక్కువ' అనే లవ్లీ సాంగ్ రేపు ఉదయం 10:35 నిమిషాలకు విడుదల కానుందని తెలుస్తుంది. పోతే, ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లోని, మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా జరగనుంది.
సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa