ఈ రోజు ఉదయమే మోస్ట్ యాంటిసిపేటెడ్ పఠాన్ ట్రైలర్ విడుదలైంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా, డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ యొక్క ట్రైలర్ ను చూసి ప్రేక్షకాభిమానులు పఠాన్ మ్యానియా తో ఊగిపోతున్నారు. స్టన్నింగ్ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పఠాన్ ట్రైలర్ చూసే ఆడియన్స్ కు గూజ్ బంప్స్ తీసుకొస్తుంది.
పోతే, ఈ నెల 25వ తేదీన పఠాన్ హిందీతో పాటుగా తెలుగు, తమిళ భాషలలో కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో పఠాన్ తెలుగు ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, తమిళ్ వెర్షన్ ట్రైలర్ తలపతి విజయ్ తమతమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా డిజిటల్ లాంచ్ చేసి, పఠాన్ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa