దేశప్రజల దృష్టిని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్'. తొంభైలలో కాశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న అవమానాలు, వారిపై జరిగిన అకృత్యాలు, వారి ఊచకోత నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ మెప్పును సైతం ఈ మూవీ పొందడం విశేషం. ఈ సినిమాకు ప్రశంసలు ఎంతలా వచ్చాయో విమర్శలు, నిరసనలు కూడా అదేవిధంగా వెల్లువెత్తాయి. అయితే ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోని ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగానో ఆదరించారు. బాలీవుడ్లో దాదాపు 250కోట్ల భారీ కలెక్షన్లతో అక్కడి రికార్డులను తిరగరాసింది.
ధియేటర్ల గోడలను బద్దలు చేసిన ఈ మూవీ తాజాగా 95వ అకాడెమీ అవార్డుల ఫస్ట్ లిస్ట్ లో బెస్ట్ ఫిలిం క్యాటగిరిలో క్వాలిఫై అయ్యింది. ఇందుకు సంబంధించిన వార్తను అఫీషియల్ గా ప్రకటిస్తూ వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
పోతే, ఫైనల్ ఆస్కార్ నామినేషన్స్ ఈనెల 24న విడుదల కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa