కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నుండి ఈ పొంగల్ కి రాబోతున్న సరికొత్త చిత్రం "వారిసు". వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ రోజు చెన్నైలో వారిసు మూవీ స్పెషల్ ప్రివ్యూ కి విజయ్ ఇతర ముఖ్య తారాగణంతో కలిసి హాజరు కాబోతున్నారట. మరి, ఈ విషయంపై మరింత క్లారిటీ రావలసి ఉంది.
రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. వారిసు మూవీ వరల్డ్ వైడ్ గా జనవరి 11న విడుదల కాబోతుండగా, తెలుగు వెర్షన్ "వారసుడు" జనవరి 14న విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa