పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ, తొలి పీరియాడికల్ యాక్షన్ డ్రామా "హరిహర వీరమల్లు". ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
హరిహర వీరమల్లు ప్రెజెంట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్ లో జరుగుతుంది. ఈ సెట్స్ లో పవన్ మరియు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. మరొక వారంలో ఈ షెడ్యూల్ పూర్తి కాబోతుంది. ఆపై కొన్నిరోజులు పండగ హాలిడేస్ తీసుకున్న తదుపరి పవన్ తిరిగి HHVM సెట్స్ లో అడుగుపెట్టనున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa