2022యేడాదిని "బింబిసార" బ్లాక్ బస్టర్ తో ఘనంగా ముగించిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ ఏడాది "అమిగోస్" తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఫిలిం గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతుంది.
పోస్టర్లతో అమిగోస్ ప్రపంచంలోని డాపుల్ గ్యాంగర్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేసిన మేకర్స్ తాజాగా టీజర్ రూపంలో అమిగోస్ ప్రపంచంపై ఆడియన్స్ కు ఒక రఫ్ ఐడియా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 11:07 నిమిషాలకు అమిగోస్ టీజర్ విడుదల కాబోతుంది.
బింబిసార ఘనవిజయం తదుపరి కళ్యాణ్ రామ్ నుండి రాబోతున్న సినిమా కావడం, అందునా ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో నటించడం, పైపెచ్చు ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు ఆసక్తిని కలిగిస్తుండడంతో ఫ్యాన్స్ అమిగోస్ టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా .. అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa