టాలీవుడ్ లో జరుగుతున్న రీ రిలీజ్ ట్రెండ్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఒక్కడు' కూడా చేరబోతోంది. రేపే ఈ సూపర్ హిట్ మూవీ మరోసారి ప్రేక్షకులను థియేటర్లలో అలరించడానికి రాబోతుంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులు ఒక్కడు మ్యానియా ను మరోసారి ఎక్స్పీరియన్స్ చేసేందుకు థియేటర్లకు క్యూలు కడుతున్నారు.
గుణశేఖర్ డైరెక్షన్లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన భూమిక నటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై MS రాజుగారు ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఈ సినిమాలో ఓబుల్ రెడ్డి గా ప్రకాష్ రాజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖేష్ ఋషి, చంద్రమోహన్, రాజన్ పి దేవ్, గీత, తెలంగాణ శకుంతల ముఖ్యపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa