కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ కుమార్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తునివు". హెచ్ వినోద్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పొంగల్ కానుకగా ఈనెల 11వ తేదీన థియేటర్లకు రాబోతుంది.
తునివు సంగతి పక్కన పెడితే, అజిత్ నెక్స్ట్ మూవీ పై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. విఘ్నేష్ శివన్ తో అజిత్ తన 62 వ సినిమాను చేసేందుకు కమిటైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో అజిత్ కు విలన్గా విలక్షణ నటుడు అరవింద్ స్వామి నటించబోతున్నారట. అలానే మరొక కీలకపాత్రలో కమెడియన్ టర్న్డ్ హీరో సంతానం నటించబోతున్నారని టాక్ నడుస్తుంది. పోతే, మరొక విశేషమేంటంటే ఈనెల 17నుండి మూవీ పట్టాలెక్కబోతుందంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa