టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఆమెతో ఇప్పటికే పెళ్లి, నిశ్చితార్థం డేట్ కూడా ఖాయమైనట్లు సమాచారం. ఈనెల 26న శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లి ఏప్రిల్లో ఉంటుందని సమాచారం. కాగా, శర్వానంద్ పెళ్లిచేసుకునే అమ్మాయి మాజీ మంత్రి మనువరాలు అని తెలుస్తోంది.