మ్యూజిక్ డైరెక్టర్ కం యాక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం "చోరుడు/ కల్వన్". పీవీ శంకర్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ఢిల్లీ బాబు నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ భారతీరాజా కీరోల్ లో నటిస్తున్నారు.
తాజా అఫీషియల్ సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆడియో రైట్స్ ను థింక్ మ్యూజిక్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తుంది. ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఈ రోజు సాయంత్రం విడుదల కాబోతుంది. విశేషమేంటంటే, స్టార్ హీరో ధనుష్ ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa