ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో 2020లో విడుదలైన 'అల వైకుంఠపురం' సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా 'షెహజాదా' పేరుతో హిందీలో రీమేక్ అవుతుంది. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్, గ్లామరస్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతుంది.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, ఈ మూవీ ట్రైలర్ జనవరి 12వ తేదీన విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది.
రోహిత్ ధావన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను టి సిరీస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, బ్రాట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతం సంగీతం అందిస్తున్నారు. పరేష్ రావల్, మనిషా కొయిరాలా, రోనిత్ రాయ్, సచిన్ ఖేడ్కర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa