నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ సంక్రాంతికి "వీరసింహారెడ్డి" గా ప్రేక్షకులను పలకరించి, అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.
సంక్రాంతి కానుకగా జనవరి 13న అంటే మరొక వారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంటుంది. విశేషమేంటంటే, ఈ ఈవెంట్లోనే రాత్రి 08:17 నిమిషాలకు ట్రైలర్ కూడా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa