ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని ఖరారు చేసిన 'అఖండ' హిందీ వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 06:11 PM

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా OTTలో కూడా సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టించింది. తాజాగా ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా హిందీలో విడుదలవుతోంది. అఖండ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా మరియు సాజిద్ ఖురేషి విడుదల చేస్తున్నారు. తాజగా మూవీ మేకర్స్ ఈ సినిమా హిందీ ట్రైలర్ ని కూడా విడుదల చేసారు.

అఖండ హిందీ వెర్షన్ జనవరి 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ మేక, ప్రగ్యా జైస్వాల్, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa