సంతోష్ శోభన్ నటించిన న్యూ మూవీ "కళ్యాణం కమనీయం". కొంతసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి కళ్యాణం కమనీయం ట్రైలర్ ను డిజిటల్ లాంచ్ చేసారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఉద్యోగం చేసే భార్య, ఏదైనా చేసే మామ.. ఇలాంటి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన హీరో.. .. ఆపై ఉద్యోగం లేదని హేళన చేస్తున్న జనాలు,.. మరి శివ (హీరో) ఉద్యోగం సాధించాడా? శ్రుతి (హీరోయిన్) నమ్మకాన్ని తిరిగి గెలుచుకున్నాడా ? ..తెలుసుకోవాలంటే జనవరి 14న విడుదల కాబోయే కళ్యాణం కమనీయం సినిమాను చూడాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే , ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను నమోదు చేసింది.
ఈ సినిమాకు అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa