షారుక్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన ‘పఠాన్’ సినిమాపై కొద్దిరోజులుగా వివాదాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపిక డ్రస్సింగ్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. తాజాగా ‘పఠాన్’ చిత్రానికి సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. సుమారు 13 కట్స్‌తో ఈ చిత్రానికి సెన్సార్ ఇచ్చారట. అయితే ‘బేషరమ్ రంగ్’ సాంగ్‌లోని ఆరెంజ్ కలర్ బికినీ సీన్లు తొలగించకుండా దీపికా అర్థనగ్న దృశ్యాలు మాత్రం కట్ చేశారని సమాచారం.