తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా, డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా "వారిసు". ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు వారిసు ట్రైలర్ విడుదల కాగా, ఆడియన్స్ నుండి ఈ ట్రైలర్ కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్ విడుదలైన 48 నిమిషాలలోనే 5మిలియన్ డిజిటల్ వ్యూస్ ను రాబట్టి విజయ్ క్రేజ్ఎలా ఉంటుందో తెలిపింది. అంతేకాక ఈ ట్రైలర్ విడుదలైన గంట వ్యవధిలోనే యూట్యూబులో 1మిలియన్ లైక్స్ వచ్చాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. పొంగల్ 2023 కానుకగా తమిళ, తెలుగు భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa