ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజిత్ కుమార్ 'తునివు' కి సెన్సార్ బోర్డు షాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 06:42 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'తునివు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ హీస్ట్ డ్రామా జనవరి 10, 2023న విడుదల కానుంది.

ఈ సినిమా సెన్సార్‌తో సహా అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ని పొందింది. తాజా అప్డేట్ ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాలో 13 కట్‌లను తీసివేయాలని/మ్యూట్ చేయాలని డిమాండ్ చేసి సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. కట్‌లలో కొన్ని హింసాత్మక కంటెంట్ మరియు కస్ పదాలు ఉన్నాయి అని సమాచారం.

ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa