హెచ్ వినోద్ డైరెక్షన్లో తాలా అజిత్, మంజు వారియర్, సముద్రఖని ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా "తునివు". తెలుగులో 'తెగింపు' టైటిల్ తో విడుదల కాబోతుంది.
తాజాగా తెగింపు సినిమా నుండి చిల్ల చిల్ల లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ ఆల్రెడీ తమిళంలో విడుదలై, అక్కడి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. మరి ఇప్పుడు తెలుగులో విడుదలైన ఈ పాటకు మన తెలుగు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఘిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటను తెలుగులో యాజిన్ నిజార్ పాడారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ అందించారు.
బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా పొంగల్ 2023 కానుకగా తమిళ, తెలుగు భాషలలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa