మాస్ రాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న "ధమాకా" సినిమా నుండి ఫస్ట్ లిరికల్ గా విడుదలైన 'జింతాక్' సాంగ్ యూట్యూబులో మిలియన్ల కొద్దీ వీక్షణలను రాబడుతూ... టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుంది. సినిమా విడుదలైన తరవాత ఈ పాటకు ఆడియన్స్ నుండి మరింత రెస్పాన్స్ వస్తుంది. దీంతో జింతాక్ సాంగ్ టీజర్ ను కొంతసేపటి క్రితమే మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. మరి, అతి త్వరలోనే జింతాక్ వీడియో సాంగ్ కూడా విడుదల అవ్వనుంది. ఇప్పటికి ఈ సాంగ్ కు యూట్యూబులో 43 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. భీమ్స్ స్వరపరిచిన ఈ పెప్పీ మాస్ డాన్స్ నెంబర్ లో రవితేజ, శ్రీలీలల కెమిస్ట్రీ, అమేజింగ్ డాన్స్, సింగర్స్ మంగ్లీ, భీమ్స్ ల ఎనర్జిటిక్ వాయిస్... తో ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
నక్కిన త్రినాధరావు ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa