వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా "వారిసు". ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. పొంగల్ 2023 కానుకగా తమిళ, తెలుగు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్ అభిమానుల్లో భారీ అంచనాలను నమోదు చేస్తుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కొంతసేపటి క్రితమే మేకర్స్ వారిసు ట్రైలర్ రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఐదు గంటలకు వారిసు ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa