అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా, దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ "హిట్ 2". డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిట్ 2 మూవీ రెంటల్ బేసిస్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. దీంతో ప్రైమ్ యూజర్లతో సహా ఎవరు ఈ సినిమాను డిజిటల్ లో చూడాలనుకున్నా 129 రూపాయలు చెల్లించాల్సిందే. మరి, జనవరి 6 నుండి రెగ్యులర్ సబ్స్క్రిప్షన్ చేసుకునే యూజర్లకు అందుబాటులోకి రానుందని అంటున్నారు. దీనిపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించగా, ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa