గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న సినిమా "వీరసింహారెడ్డి". సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ముమ్మర ప్రచార కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇందులో భాగంగా రేపు రాత్రి 07:55 నిమిషాలకు మాస్ మొగుడు లిరికల్ వీడియో విడుదల కాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ ఒకరేంజులో ఆడియన్స్ ను అలరిస్తుండడంతో రాబోయే పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa