జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న చిత్రం "హనుమాన్". యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వినోద్ రాయ్ కీరోల్స్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ పాన్ ఇండియా వైడ్ ఎంతటి భీకర సెన్సేషన్ సృష్టించిందో ...తెలిసిన విషయమే. ఈ టీజర్ లో హనుమంతుడు ఉచ్ఛరించే 'రామ్' మంత్రం స్పెషల్ హైలైట్ గా నిలిచింది. ఈ మంత్రంతోనే హనుమాన్ టీం ప్రేక్షకులకు కొత్తసంవత్సర శుభాకాంక్షలను తెలియచేసింది. రామమంత్రాన్ని ఆగుమెంటెడ్ రియాలిటీలోకి మార్చి, జస్ట్ QR కోడ్ స్కాన్ చేస్తే రామమంత్రం వినిపించేలా ఏర్పాటు చేసారు. మరి, టీం హనుమాన్ నుండి ఇదొక యూనిక్ ఎనౌన్స్మెంట్ అని చెప్పవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa