ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలు... ఉచిత సినిమా ప్రదర్శనలు

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 01, 2023, 06:22 PM

నవరస నటనా సార్వభౌమ శ్రీ. నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు గతకొన్నిరోజుల నుండి ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలలో భాగంగా పలువురు సినీప్రముఖులు ఎన్టీఆర్ సెంటినరీ అవార్డులతో సత్కరించబడుతున్నారు.


తాజాగా ఈ ఉత్సవాలలో భాగంగా ఉచిత సినిమా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ మేరకు రేపు వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా తెనాలి లోని పెమ్మనేని రామకృష్ణ థియేటర్లో ఎన్టీఆర్ గారి డివోషనల్ క్లాసిక్ 'శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం' సినిమా ప్రదర్శితం కానుంది. కావున, ప్రేక్షకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa