తీసింది రెండు సినిమాలే అయినా... స్టార్ స్టేటస్ అందుకున్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. 2020లో హిట్ సినిమాతో తెలుగు సినీరంగానికి డైరెక్టర్ గా పరిచయమైన శైలేష్ ఆపై రెండో సినిమాగా హిట్ 2 తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో శైలేష్ నెక్స్ట్ మూవీపై అంతటా ఆశక్తి నెలకొంది.
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ గారితో శైలేష్ సినిమా చెయ్యబోతున్నాడని కొన్నిరోజుల నుండి ఒక వార్త ప్రచారంలోకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్త నిజమేనని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫార్మల్ ఎనౌన్స్మెంట్ అండ్ పూజా కార్యక్రమం జనవరి 26న జరగబోతుందని, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ షురూ కాబోతుందని తాజా సమాచారం. పోతే, ఈ ప్రాజెక్ట్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించబోతుందట.
మరి, శైలేష్ తో వెంకీ మామ సినిమా నిజంగా ఉంటుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa