ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు బాలీవుడ్ కి పయనమవుతున్న 'హిట్ 2'..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 04:23 PM

శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన హిట్ 2 ఈనెల 2న విడుదలై ఘనవిజయం సాధించింది. అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాలో రావు రమేష్, తనికెళ్ళ భరణి, కోమలీ ప్రసాద్, శ్రీనాధ్ మాగంటి, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్ కీరోల్స్ లో నటించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.


మేజర్ సినిమాతో ఉత్తరాదిన అడివిశేష్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ హిట్ 2 ను హిందీలో కూడా విడుదల చెయ్యబోతున్నారు. ఈ మేరకు రేపటి నుండే బాలీవుడ్ వెండితెరపై హిట్ 2 హల్చల్ చెయ్యనుంది. ఇక్కడ సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసిన హిట్ 2 మరి అక్కడ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో.. చూడాలి.


వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa