అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ "హిట్2" రీసెంట్గానే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ఐన విషయం తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని గారు నిర్మించడం జరిగింది.
మేజర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ సంపాదించుకున్న శేష్ హిట్ 2 సినిమాను హిందీలో కూడా విడుదల చెయ్యబోతున్నట్టు కొన్నిరోజుల క్రితమే తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన హిట్ 2 మూవీ హిందీలో గ్రాండ్ గా విడుదల కాబోతుందని కొంతసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa