ఈ నెల 31వ తేదీన అంటే ఈ శనివారం థియేటర్లకు రాబోతున్న సినిమాలలో "కొరమీను" ఒకటి. ఆనంద్ రవి, కిషోరీ ధాత్రిక్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీపతి కర్రి డైరెక్ట్ చేస్తున్నారు. ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుండి వరసగా లిరికల్ సాంగ్స్ విడుదలవుతూ వస్తున్నాయి. తాజాగా మేకర్స్ అహమే ఇది అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ వీడియో సాంగ్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు డిసెంబర్ 30 సాయంత్రం ఐదు గంటలకు విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa