కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం "రైటర్ పద్మభూషణ్". ఈ సినిమాతో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. జి మనోహరన్ సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
ఈపాటికి విడుదలవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11:07 నిమిషాలకు అధికారిక విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు మేకర్స్ సరికొత్త ప్రకటన చేసారు.
పోతే, ఈ సినిమాలో సుహాస్ అసిస్టెంట్ లైబ్రేరియన్ గా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa