టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు ఈ నెల 25న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందారు. కాగా, ఆయన కుమార్తెలు అమెరికా నుండి రావాల్సి ఉండడంతో చలపతిరావు అంత్యక్రియలు నేడు పూర్తి చేశారు. జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానం విద్యుత్ దహన వాటిక వద్ద ఆయన కుమారుడు రవిబాబు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. చలపతిరావుకు పలువురు సినీ ప్రముఖులు అశ్రునివాళి తెలుపుతున్నారు.