మెగాస్టార్ చిరంజీవి గారి న్యూ మూవీ "వాల్తేరు వీరయ్య" నుండి నిన్న రాత్రి థర్డ్ సింగిల్ వీరయ్య టైటిల్ ట్రాక్ విడుదలైంది. DSP ఫెరోషియస్ ట్యూన్, చిరు అగ్రెసివ్ యాక్టింగ్, చంద్రబోస్ కమెండబుల్ లిరిక్స్...వెరసి ఈ సాంగ్ శ్రోతల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. దీంతో ఈ పాట యూట్యూబ్ లో 3 మిలియన్ కు పైగా వీక్షణలను రాబట్టి, 147 కే లైక్స్ తో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa