కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్స్ లో , సపోర్టింగ్ రోల్స్ లో, విలన్గా నటిస్తూ.. ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేస్తుంది.
లేటెస్ట్ గా ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం "ఛేజింగ్". కే వీరకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యగా, తాషి సంగీతం అందించారు. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో వరలక్ష్మి పవర్ఫుల్ కాప్ రోల్ లో నటిస్తుంది. ఆసియా సిన్ మీడియా బ్యానర్ పై మతియలగన్ మునియాండీ ఈ సినిమాను నిర్మించారు.
లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ సరికొత్త ప్రకటన చేసారు. ఈ మేరకు ఛేజింగ్ ఈ నెల 31వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa