ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వారిసు' ఆడియో లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు కీలకవ్యాఖ్యలు..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 08:43 AM

"వారిసు" సినిమాతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు కోలీవుడ్ సినీరంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటించారు. థమన్ సంగీతం అందించారు. పొంగల్ 2023 కానుకగా తమిళ, తెలుగు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ నిన్న చెన్నైలోని నెహ్రూ స్టేడియం లో అంగరంగ వైభవంగా జరిగింది.


ఈ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ... వారిసు సినిమాపై ఆడియన్స్ కు సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. చాన్నాళ్లుగా వినిపిస్తున్న పుకార్లకు అడ్డుతెర వేశారు. అదేంటంటే, వారిసు స్టిల్స్ చూసిన కొందరు ఈ సినిమా మహేష్ బాబు మహర్షి సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారని, మరికొందరేమో వెంకటేష్ సంక్రాంతికి సీక్వెల్...అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారిసు ఆడియో లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.


వారిసు పక్కాగా తెరకెక్కిన తమిళ సినిమా అని, ఇది ఏ సినిమాకు సీక్వెల్ / రీమేక్ కాదని బల్లగుద్ది చెప్పారు. వారిసుతో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలో పండగ చేసుకుంటారు అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa