గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. వీరసింహా రెడ్డి జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమాలోని రెండు సింగిల్స్ - జై బాలయ్య మరియు సుగుణ సుందరి స్మాషింగ్ హిట్‌లుగా నిలిచాయి.
తాజాగా ఇప్పుడు, ఈ సినిమా ఆల్బమ్ నుండి మూవీ మేకర్స్ థర్డ్ సింగల్ ని ఈరోజు హైదరాబాద్‌లోని సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో 'మా బావ మనోభవాలు' అనే టైటిల్ తో విడుదల చేసారు. రామజోగయ్య శాస్త్రి యొక్క సాహిత్యం మరియు థమన్ ఆకట్టుకునే బీట్స్ ఈ పాటకు మాస్ వైబ్ ని క్రియేట్ చేసాయి.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa