ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంధ్య థియేటర్లో అట్టహాసంగా .. "మా బావ మనోభావాలు" లాంచ్ ఈవెంట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 06:23 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ గారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తొలిసారిగా నటిస్తున్న సినిమా "వీరసింహారెడ్డి". శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ కీరోల్స్ లో నటిస్తున్నారు.


తాజాగా ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్, RTX రోడ్స్ లోని సంధ్య 35MM థియేటర్లో వీరసింహారెడ్డి థర్డ్ సింగిల్ 'మా బావ మనోభావాలు' సాంగ్ లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ఈ పాటలో మీరు చూసింది కేవలం శాంపిల్ మాత్రమే నని, థియేటర్ సీట్స్ లో కూర్చోరని చెప్పారు. సమరసింహారెడ్డి వైబ్స్ వినిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు.


పోతే, ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa