కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం "మెర్రి క్రిస్మస్". కత్రినా చాలా కాలం తర్వాత చేస్తున్న సౌత్ సినిమా ఇది. అంతేకాక ఈ సినిమాతో కత్రినా కోలీవుడ్ డిబట్ ఎంట్రీ ఇవ్వబోతుంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సౌత్ మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాధికా శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
గతేడాది నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలవ్వాల్సి ఉండగా, వచ్చే ఏడాదికి వాయిదా పడిందని తెలుపుతూ మేకర్స్ కొంతసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు వచ్చే ఏడాది హిందీ తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa