క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అందించిన విభిన్నమైన ప్రేమకథను డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ 18 పేజెస్ సినిమాగా రూపొందించిన విషయం తెలిసిందే కదా. నిన్ననే థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ నంబర్లు ఈ సినిమాపేరుపై నమోదవుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, 18 పేజెస్ మూవీ విడుదలైన తొలి రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యి, లాభాల బాటలో నడుస్తుంది.
బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 తదుపరి హీరో నిఖిల్ సిద్దార్ధ, అనుపమ జంటగా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించగా, గోపీసుందర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa