పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన "లైగర్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్సీడ్ రివ్యూస్ అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది. ఇటీవల ఈ సినిమా స్టార్ మాలో ప్రసారమైంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, బాక్స్ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ చిత్రం 6.68 టిఆర్‌పిని పోస్ట్ చేసింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa