ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT భాగస్వామిని లాక్ చేసిన లేడీ సూపర్ స్టార్ 'కనెక్ట్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 07:31 PM

అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'కనెక్ట్' సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్ఫారం నెట్ఫ్లిక్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ఈ సినిమాలో బాలీవుడ్ లోని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. సత్యరాజ్, వినయ్ రాయ్, హనియా నఫీసా మరియు ఇతరులు ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విఘ్నేష్ శివన్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa