కన్నడ హీరో యష్ కు ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్డం ఇచ్చింది KGF ఫ్రాంచైజీ. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ లో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసారు. 2018లో కేజీఎఫ్ : చాప్టర్ 1, 2022లో కేజీఎఫ్ : చాప్టర్ 2 విడుదలై.. పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ హిట్టైన విషయం తెలిసిందే కదా.
కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 పై అఫీషియల్ క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ...తాజాగా ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై చిన్న హింట్ ఇచ్చారు. రీసెంట్ మీడియా ఇంటిరాక్షన్ లో నిర్మాత విజయ్ కిరంగదుర్ మాట్లాడుతూ... ప్రశాంత్ నీల్ "సలార్" ముగించిన తదుపరి KGF 3 గురించి ఆయనతో చర్చిస్తాం.. అని చెప్పారు. దీంతో సలార్ ముగిసిన తరవాతే KGF 3 అప్డేట్ రాబోతుందని ఖచ్చితంగా తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa