ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్' డైరెక్టర్ నుండి అన్ ఎక్స్పెక్టెడ్ మూవ్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 04:25 PM

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ గా తన హవా చూపిస్తున్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. చేసిన నాలుగు సినిమాలతోనే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుని ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. ఈ ఏడాది లోకేష్ నుండి విక్రమ్ సినిమా వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తదుపరి తలపతి విజయ్ తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న లోకేష్ పై ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.


అదేంటంటే, లోకేష్ కనగరాజ్ నుండి అతి త్వరలోనే ఒక హార్రర్ మూవీ ఎనౌన్స్మెంట్ రాబోతుందంట. ఐతే, డైరెక్టర్ గా కాకుండా... నిర్మాతగా ఈ సినిమా టైటిల్స్ కార్డ్స్ లో లోకేష్ పేరు పడబోతుందన్న మాట. విశేషమేంటంటే, ఈ హార్రర్ ఫ్లిక్ లో కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్నారని వినికిడి. మరి, అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa