ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ అరంగేట్రం చేసిన 'లవ్ టుడే' తెలుగు వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 03:50 PM

కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' సినిమా తెలుగు-డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 18, 2022న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజగా ఇప్పుడు, లవ్ టుడే డిసెంబర్ 23వ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.


రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా జంటగా నటించారు. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa