ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన బాలకృష్ణ

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 11:16 AM

తెలుగు ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కైకాల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం తెలిపారు. తన లుక్స్, యాక్టింగ్, మ్యానరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మృతి తెలుగు సినీ పరిశ్రమతో పాటు తెలుగు వారికి తీరని లోటు అని అన్నారు. తెలుగు చిత్రసీమ వినీలాకాశం మాట్లాడుతూ గొప్ప ధృవతారను కోల్పోవడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడితో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చేసిన నటన మరువలేనిదని కొనియాడారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa