ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైకాల మృతిపట్ల మెగాస్టార్ భావోద్వేగకర పోస్ట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 10:39 AM

నవరస నటనా సార్వభౌముడు.. శ్రీ కైకాల సత్యనారాయణ గారు ఇక లేరు. ఎప్పటి నుండో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కైకాల గారు ఈ రోజు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించడం జరిగింది. కైకాల ఆకస్మిక మృతి ఆయన కుటుంబసభ్యులను, అభిమానులను, తెలుగు పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.


ఈ సందర్భంగా కైకాలతో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మృతికి నివాళులర్పిస్తూ.. ఒక భావోద్వేగకర పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. గతేడాది, ఈ ఈఏడాది కైకాల పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలవడం జరిగిందని, ఈ సందర్భంగా సురేఖ చేతి వంటను తెగ ఇష్టపడే కైకాల ఉప్పుచేప వండి పంపించమని కోరినట్టు తెలిపారు. కైకాల చిరుని ప్రేమతో తమ్ముడూ అని సంబోధించేవారట. ఆయనతో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, ఆనందకరమైన సంఘటనలు ఉన్నాయంటూ.. చిరు పోస్ట్ లో పేర్కొన్నారు. గొప్ప సినీ సంపదను కైకాల గారు అందరికీ అందించి వెళ్లిపోయారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని చిరు తెలియచేసారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa