ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వినరో భాగ్యము విష్ణు కథ' ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 22, 2022, 08:41 PM

నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే టైటిల్‌ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. ఈ విలేజ్ డ్రామా చిత్రం ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సినిమాలోని వాసవ సుహాస మొదటి పాటను డిసెంబర్ 24, 2022న సాయంత్రం 06:19 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజగా ఇప్పుడు మూవీ మేకర్స్ వాసవ సుహాస సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసారు. ఈ పాటను కరుణ పాడగా, విడుదల చేసిన వీడియో గ్లింప్సె  లో కిరణ్ అబ్బవరం కూల్ అవతార్‌లో కనిపిస్తున్నారు.
 
మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa