ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీ ని ఖరారు చేసిన సంతానం 'ఏజెంట్ కన్నయిరం'

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 22, 2022, 08:30 PM

2019లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో భారీ హిట్ సాధించాడు. తాజాగా మనోజ్ బీద దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రముఖ కమెడియన్ సంతానం 'ఏజెంట్ కన్నయిరం' అనే టైటిల్ తో రీమేక్ చేయగా ఈ సినిమా నవంబర్ 25, 2022న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని బాక్స్ఆఫీస్ వద్ద విఫలమైంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం డిసెంబర్ 23 నుండి సన్ నెక్ట్స్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది అని సమచారం. ఈ చిత్రంలో రియా సుమన్, శృతి హరిహరన్, పుగజ్, మునిష్కాంత్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లాబ్రింత్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa