కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన న్యూ మూవీ "కనెక్ట్". అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో రేపు విడుదల కాబోతుంది. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినోద్ రాయ్ కీలకపాత్రల్లో నటించారు. ప్రచారాల్లో పాల్గొనని నయన్ ఈ సినిమా కోసం తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది.
పోతే, రేపే... కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన పాన్ ఇండియా మూవీ "లాఠీ" కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం విశాల్ కూడా తెలుగులో భీకర ప్రమోషన్స్ చేసారు. వినోద్ కుమార్ డైరెక్షన్లో పవర్ఫుల్ పోలీస్ స్టోరీ తో రూపొందిన ఈ సినిమాలో విశాల్ కానిస్టేబుల్ గా నటించారు.
దీంతో.. రేపు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు కోలీవుడ్ సినిమాలు సందడి చెయ్యబోతున్నాయని తెలుస్తుంది. మరి, ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి. ఈ ఇద్దరిలో టాలీవుడ్ ఆడియన్స్ హృదయాలను దోచుకునే సినిమా ఏదో... తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa