ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీరసింహారెడ్డి' స్పెషల్ సాంగ్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 21, 2022, 05:34 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. వీరసింహా రెడ్డి జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమాలోని రెండు సింగిల్స్ - జై బాలయ్య మరియు సుగుణ సుందరి స్మాషింగ్ హిట్‌లుగా నిలిచాయి. ముఖ్యంగా సుగుణ సుందరి సాంగ్ లో బాలకృష్ణ డ్యాన్స్‌ స్టెప్స్ తో అంచనాలను మరో స్థాయికి వెళ్లాయి.


తాజాగా ఇప్పుడు, ఈ సినిమా ఆల్బమ్ నుండి మూవీ మేకర్స్ థర్డ్ సింగల్ ని డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ బాలకృష్ణ బ్లాక్ బ్లేజర్ మరియు కూల్ సన్ గ్లాసెస్‌లో ఉన్న స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa