షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న "పఠాన్" మూవీ నుండి కొంతసేపటి క్రితమే సెకండ్ సింగిల్ గా ఝుమ్ జో పఠాన్ సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు రేపు ఉదయం పదకొండు గంటలకు ఈ పాట తెలుగు, హిందీ భాషలలో విడుదల తేదీ కాబోతుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది.
సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషలలో వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. జాన్ అబ్రహం కీ రోల్ లో నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa