ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2022లో నిరాశపరిచిన బాలీవుడ్ సినిమాలివే

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 21, 2022, 02:53 PM

ఈ ఏడాది బాలీవుడ్ లో చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. సినిమాకు పెట్టిన బడ్జెట్ కంటే తక్కువ వసూళ్లను రాబట్టాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
* అక్షయ్ కుమార్ నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాను రూ.175 కోట్లతో నిర్మిస్తే రూ.68.06 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
* రణ్ బీర్ కపూర్ నటించిన 'షంషేరా' రూ.150 కోట్లతో రూపొందగా రూ.41.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
* ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాను రూ.180 కోట్లతో తెరకెక్కించగా రూ.59.58 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
* అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్ పాండే రూ.165 కోట్లతో నిర్మించగా రూ.49 కోట్లు మాత్రమే రాబట్టింది.
* కంగనా రనౌత్ నటించిన ధాకడ్ రూ.85 కోట్లతో నిర్మించగా రూ.2.3 కోట్లు మాత్రమే వచ్చాయి.
* అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ నటించిన 'రన్ వే 34' సినిమా రూ.65 కోట్లతో నిర్మితమై రూ.33.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
* అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమా బడ్జెట్ రూ.100 కోట్లు కాగా, రూ.45.23 కోట్లే వసూలు చేసింది.
* ఆయుష్మాన్ ఖురానా నటించిన 'యాక్షన్ హీరో' రూ.8.19 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
* రణ్ వీర్ సింగ్ నటించిన 'జయేశ్ భాయ్ జోర్దార్' రూ.86 కోట్లతో నిర్మించగా రూ.16.59 కోట్లు మాత్రమే రాబట్టింది.
* టైగర్ ష్రాఫ్ నటించిన 'హీరోపంతి-2' రూ.70 కోట్లతో తెరకెక్కగా రూ.24.91 కోట్లు మాత్రమే రాబట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa